స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో చుక్కల భూముల సమస్యలను పరిష్కరించే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనిపై లక్ష్మీనారాయణ స్పందిస్తూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న చుక్కల భూముల సమస్యను క్లియర్ చేసినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు. భూయజమానులకు అవసరమైన సరిచేసిన పత్రాలు త్వరలో లభిస్తాయని ఆశిస్తున్నానని తెలిపారు.
ఈ ట్వీట్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ‘థాంక్యూ లక్ష్మీనారాయణ గారూ. ఇది జగనన్న ప్రభుత్వం.. మన రైతన్న ప్రభుత్వం’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రభుత్వాన్ని పొగుడుతూ జేడీ చేసిన ట్వీట్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Thanks to AP Government for clearing the long pending dotted lines issue . Hope the landowners get the required corrected land documents soon. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న చుక్కల భూముల సమస్యను క్లియర్ చేసినందుకు AP ప్రభుత్వానికి ధన్యవాదాలు. భూయజమానులకు అవసరమైన సరిచేసిన భూపత్రాలు…
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) May 13, 2023