స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిషరించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి విశాఖకు బయలుదేరతారు. పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియంకు సాయంత్రం 3.50 గంటలకు చేరుకుంటారు. అనంతరరం అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవలోని అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 5.50 గంటలకు వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభింస్తారు. రామ్ నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను ప్రారంబిస్తారు. ఆ తర్వాత ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్ధాపన చేస్తారు. అనంతరం సా. 6.15 గంటలకు ఏయూ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పుత్రుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని తిరిగి రాత్రి 8.20 గంటలకు తాడేపల్లికి ప్రయాణమవుతారు.
విశాఖ పర్యటన.. వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్
0
491
Previous article
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


