కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం… మొత్తం ఎన్ని స్థానాలకు పొటీ అంటే?

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్ణాటకలో కొద్దీ రోజులుగా హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలతో ముగిసింది. కర్ణాటక సింహాసనాన్ని అధిష్టించేందుకు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తమతమ బడా నేతలతో ప్రచారం నిర్వహించారు. తాము గెలిస్తే.. రాష్ట్రానికి ఏమేం చేస్తామో.. ఆ హామీలన్నీ వివరించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు, స్థానిక సమస్యల ప్రక్షాళన వంటి అంశాలతో దూసుకెళ్లారు. ప్రధానంగా క్యాంపెయిన్ లో ప్రతిపక్షాలపై విరుచుకుపడడం, తాము చేసిన అభివృద్ధిని చర్చించడం, రోడ్ షోలు వంటి అనేక ప్రచారాలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో 2,613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బుధవారం పోలింగ్ నిర్వహించి.. 13న ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగనుంది.

రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా 113 అసెంబ్లీ స్థానాలు గెలవాల్సి ఉంది. ఇక మొత్తం 224 సీట్లలో 36 సీట్లు ఎస్సీ, 15 ఎస్టీ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 .2 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును ఎన్నికలలో వినియోగించుకోగా.. మొదటిసారి ఓటును వేస్తున్నవారు 9 .17 లక్షల మంది ఉన్నారు. ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 58282 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది. కాగా ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్