స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలో ముఖ్యమంత్రి అసమర్థ పాలనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు , విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి తదితరులు మీడియా సమావేం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభూత్వం, తమ అధినేత చంద్రబాబు పాలనలో చేపట్టిన భోగాపురం ఎయిర్ పోర్ట్, అదానీ డేటా సెంటర్ లకు సిఎం జగన్ శంఖుస్థాపనలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు విశాఖలో ఎయిర్ పోర్ట్ వుండగా భోగాపురంలో రెండో విమానాశ్రయం అనవసరమన్నారని, తాము అధికారం లోకి వచ్చిన తరువాత భోగాపురం భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని ప్రజలను ఏమార్చారన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్ళ అనంతరం మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయని శంఖుస్థాపనల పర్వానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజలకు మేలు చేయాలని గంటా వ్యాఖ్యానించారు.
‘వాటికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయటం హాస్యాస్పదంగా ఉంది’
0
422
Previous article
Next article
Latest Articles
కల్కి 2లో.. సాయిపల్లవా..? ఆలియా భట్టా..?
కల్కి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అయితే.. కల్కి సీక్వెల్ కల్కి 2 నుంచి బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే తప్పుకున్న తర్వాత ఆ పాత్రలో నటించే బ్యూటీ ఎవరు అనేది...
- Advertisement -
- Advertisement -


