స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కేసీఆర్ పాలనలో రైతులకు భరోసాయే లేదని మండిపడ్డారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై.ఎస్.షర్మిల. ఎన్నో కష్టాలకోర్చి పంట పండిస్తే సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా ఇలా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. పాలేరులోని ఐకేపీ సెంటర్ లో నెల రోజులకు పైగా ధాన్యం కుప్పలు పోసి ఎదురుచూస్తున్నా పట్టించుకునే వారే లేరంటూ ట్విట్టర్ లో మండిపడ్డారు. అకాల వర్షాలతో వడ్లు తడిసి మొలకెత్తుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతుల పట్ల కేసీఆర్ ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం తగదని వ్యాఖ్యానించారు. సర్కార్ రైతులను ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆదుకుంటుంది? ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి తక్షణమే కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం చెల్లించి ఆదుకోవాలని కోరారు.
సర్కార్ మొద్దు నిద్ర వీడి.. కొనుగోళ్లు వేగవంతం చేయాలి: షర్మిల
0
312
Previous article
Next article
Latest Articles
నువ్వు ఎదగాలంటే ఏం చేయలి?
కర్మ అనేది ఒక ఆధ్యాత్మిక నియమం. ఇది న్యూటన్ భౌతిక శాస్త్ర నియమానికి సమానం."ప్రతి చర్యకు సమానమైన వ్యతిరేక చర్య ఉంటుంది. సంస్కృతంలో కర్మ అనే పదానికి చర్యలు అని అర్థం. మంచి...
- Advertisement -
- Advertisement -


