నటి వనితా విజయ్ కుమార్ మాజీ భర్త కన్నుమూత

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ తమిళ నటి వనితా విజయ్‌ కుమార్‌ మాజీ భర్త పీటర్‌ పాల్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వనితా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘సుదీర్ఘ పోరాటం తర్వాత మీకు విముక్తి, శాంతి లభించిందని భావిస్తున్నా. నువ్వు ఈ లోకం నుంచి వెళ్లిపోయినందుకు బాధగా ఉంది. ఇప్పటికైనా నీకు ప్రశాంతత లభిస్తుందని ఆశిస్తున్నాను. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి’ తెలిపింది. ఆయన మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖలు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

కాగా 2020 జూన్‌ 27న పీటర్‌ పాల్‌ను వనితా మూడవ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన నాలుగు నెలలకే వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రకటించారు. మద్యానికి బానిసై పీటర్ అనారోగ్యం బారిన పడినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్