నేడు శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల.. సర్వదర్శనానికి 4 గంటల సమయం

Tirumala | ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈరోజు వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శన టిక్కెట్లు విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు. ఈ ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లు విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు మే నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను టీటీడీ అధికారులు విడుదల చెయ్యనున్నారు.

ఇక సమాచారానికొస్తే.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకోవాలని రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 74,873 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,997 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, ఆదివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.34 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్