175కి 175 సీట్లే టార్గెట్‌గా ఏపీ సీఎం జగన్ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈనెల 18 నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. 2019 ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన జగన్… మరోసారి నర్సీపట్నం నుంచి లేదా ఇచ్ఛాపురం నుంచి ప్రారంభిస్తారని సమాచారం. ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం మొదలుపెట్టి..రోజుకి మూడు నియోజకవర్గాల్లో జగన్ ప్రసంగించనున్నారు. మొదటి రోజు నర్సీపట్నం లేదా ఇచ్ఛాపురం, విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.