రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అధికారులతో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ త్వరలో కొత్త విద్యుత్పాలసీని తీసుకువ స్తామని స్పష్టం చేశారు. ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. కొత్త విద్యుత్ పాలసీ కోసం ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అసెంబ్లీలో చర్చించి సమగ్ర విద్యుత్ విధానాన్ని రూపొందిస్తామని స్పష్టం చేశారు. తక్కువ ధరకు విద్యుత్‌ను ఇచ్చే కంపెనీల నుంచి మనం కొనుగోలు చేయాలని, అందుకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.
వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్
0
549
Previous article
Next article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


