స్వతంత్ర వెబ్ డెస్క్: బీజేపీకి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న వివేక్.. బీజేపీకి వెంకటస్వామి రాజీనామా చేశారు. కాసేపట్లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు వివేక్. ఇవాళ, రేపు రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం జరుగనుంది. అయితే.. ఇప్పుడు హైదరాబాద్ లోని నోవా హోటల్ లో రాహుల్ గాంధీ ఉన్నారు. మరికాసేపట్లోనే.. రాహుల్ గాంధీని కలిసి.. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు వివేక్. ఇక చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి వివేక్ వెంకటస్వామి సిద్ధం అయ్యారట. కాంగ్రెస్ లో చేరాలని వివేక్ వెంకటస్వామి నిర్ణయం తీసుకోవడంతో…చెన్నూర్ అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధం అయిందని సమాచారం. వాస్తవానికి చెన్నూర్ స్థానాన్ని పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. వివేక్ వెంకటస్వామి కోసం చెన్నూర్ స్థానాన్ని సిపిఐ కు ఇవ్వరాదని తాజాగా నిర్ణయం తీసుకుందట కాంగ్రెస్.
రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న వివేక్
0
500
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


