34.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

రసవత్తరంగా మారిన బీహార్‌ రాజకీయం … నితీశ్‌ సర్కారుకు బలపరీక్ష

        జేడీయూ చీఫ్‌ నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఇవాళ బీహార్‌ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోబో తుంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు RJD, JDU సహా వివిధ పార్టీలు వారిని గృహ నిర్బంధంలో ఉంచారని ప్రచారం జరుగుతోంది. పాట్నాలో ఏర్పాటు చేసిన పార్టీ ఎమ్మెల్యే సమావేశానికి ముగ్గురు JDU సభ్యులు హాజరుకాకపోవ డం కలకలం రేపింది. అయినా..నేడు జరగబోయే బలపరీక్షలో గెలుస్తామని సీఎం నితీశ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహాగట్‌బంధన్‌ , ఎన్డీయే కూటమి మధ్య మాటల యుద్ధం మొదలైంది. RJD ఎమ్మెల్యేలందర్నీ తేజస్వీ యాదవ్‌ గృహ నిర్బంధంలో ఉంచారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఇది పూర్తిగా అవాస్తమని చెబుతూ RJD..సోషల్‌మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా గయలోని మహాబోధి రిసార్ట్‌లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. నిన్న ప్రత్యేక బస్సులో పాట్నాకు చేరుకున్నారు. 243 స్థానాలున్న బీహార్‌ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. బీజేపీ-78, జేడీయూ-45, HAM-4, IND-1 లతో కూడిన కూటమికి మొత్తం 128 మంది ఎమ్మెల్యేల బలమున్నట్టు సమాచారం. మహాగట్‌బంధన్‌ పేరుతో ఒక్కటైన ఆర్జేడీ-79, కాంగ్రెస్‌-19, సీపీఐ-12, సీపీఎం-2, సీపీఐ-2, ఇతరులు-1, AIMIM – ఒక ఎమ్మెల్యేతో కూటమికి 113 మంది ఎమ్మెల్యేల మద్ద తుంది.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్