బీజేపీ నేతల పట్ల పోలీసుల తీరును ఖండించిన జనసేనాని

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్:  నెల్లూరు జిల్లా కావలిలో బీజేపీ నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. నిరసన గళాలు అణచివేస్తాం.. కాళ్ల కింద పడేసి తొక్కుతాం అంటే అది నియంతృత్వమేనని విమర్శించారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఏపీ ఉపాధ్యక్షుడు మొగరాల సురేశ్ పట్ల కావలిలో పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు పాలకుల మనస్తత్వానికి అద్దం పడుతోందని తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇలాంటి అణచివేత చర్యలను ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు.

కాగా శుక్రవారం కావలిలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా కమలం నేతలు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా నేత సురేశ్ మెడను ఓ పోలీస్ అధికారి తన కాళ్ల మధ్య ఇరికించాడు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు తీరుతో పాటు ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్