నేడు తెలంగాణ భవన్‌కు మాజీ సీఎం కేసీఆర్

         కృష్ణా పరివాహక ప్రాంతం నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశమయ్యారు.KRMBకి ప్రాజెక్టులను అప్పగిస్తే జరిగే నష్టం, చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణభవన్‌కు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. నిమ్మకాయ, గుమ్మడి కాయతో దిష్టి తీసి మంగళ హారతితో కార్యకర్తలు స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహానికి బీఆర్‌ఎస్ అధినేత నివాళులర్పించారు.కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపీలు, ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు. కృష్ణా బేసిన్‌లో వున్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై పోరుబాటకు సంబంధించి కార్యాచరణపై నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 13న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టుల అప్పగింతకు వ్యతిరేకంగా రైతు గర్జన పేరిట నిరసన సభ నిర్వహించబోతున్నారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్