హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఆగి ఉన్న హైదరాబాద్ – జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని B1, B2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరాల్సిన రైలులో సుమారు 6.20 గంటల ప్రాంతంలో పొగలు రావడాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందికి, హైడ్రా కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బందితో పాటు హైడ్రా DRF బృందాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాద సమయంలో బోగీల్లో ప్రయాణికులు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


