గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్

      తెలంగాణలో గవర్నర్‌ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్‌ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌ కోటాలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీలుగా నియమితులైయ్యారు. అయితే, ఈ ఇద్దరితోనూ ప్రమాణం చేయిం చవద్దని కోర్టు ఆదేశించింది.

       ఎమ్మెల్సీలుగా తమ పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తిరస్కరించడాన్ని బీఆర్ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్‌ చేశారు. మంత్రి మండలి తీర్మానం చేసి పంపిన పేర్లను ఆమె తిరస్కరించారని పిటి షనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ ప్రమాణ స్వీకా రం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రి మండలి చేసిన తీర్మానా న్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసిందని గవర్నర్ కార్యదర్శి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాస నం.. స్టేటస్‌ కో విధిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్