ఈనెల 28న నల్గొండలో బీఆర్ఎస్ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి

బీఆర్‌ఎస్‌ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్‌ఎస్‌ భావించింది. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో కూడిన పర్మిషన్‌ మంజూరు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ నల్లగొండలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించడం, రూ.4 వేల పింఛన్‌, మహిళలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్‌ఎస్‌ ఈ మహాధర్నాను తలపెట్టింది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పాల్గొనున్నారు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్