28.7 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

అయోధ్యలో మరో చరిత్రాత్మక ఘట్టం

     అయోధ్యలో బాల రాముడి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. రామ మందిర తలుపులు సామాన్య భక్తులకు తెరు చుకోవటంతో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇవాళ నుంచి స్వామివారి దర్శన భాగ్యానికి సామాన్యులను అనుమతించారు. భక్తులు సోమవారం అర్ధరాత్రి నుంచే మందిరం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ప్రభుత్వం ముం దు జాగ్రత్తగా భారీ ఎత్తున బలగాలను మోహరించింది. రాముడి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్‌కార్డు లాంటి ఏదో ఒక గుర్తింపు పత్రం తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్‌ ఇస్తారు కానీ అవి పరిమితంగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో కానీ, ప్రత్యక్షంగా ఆలయం వద్ద కానీ పాస్‌ తీసుకున్న వాళ్లకే ఆ సమయంలో అను మతిస్తారు. పదేళ్లలోపు పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది. ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, మధ్యా హ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు. సోమవారం ఘనంగా జరిగిన ప్రాణప్రతిష్ఠ తర్వాత కేవలం అతిథులు మాత్రమే శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఇక నుంచి సామాన్య భక్తులందరూ బాలరా ముడిని దర్శించునే అవకాశం కల్పించారు. దాంతో భక్తులు తాకిడి అధికంగా ఉంది.

Latest Articles

కవిత టార్గెట్ అన్న కేటీఆరేనా?

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ పోరు ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. కొత్త పార్టీ పెట్టిన కవితను ఏమాత్రం పట్టించుకోవద్దని, ఎవరెవరో వస్తుంటారు పోతుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కేడర్‌కు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్