సినీనటి జయప్రదకు నాన్‌ బెయిలబుల్ వారెంట్‌

     ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్‌ బెయిలబుల వారెంట్‌ జారీ చేసింది. 2019లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిం చారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు అయ్యాయి. వాటి విచారణకు జయప్రద హాజరు కాలేదు. దీంతో ఆమెను అరెస్ట్‌ చేసి న్యాయస్థానం ముందు ఈనెల 27న హాజరు పరచాలని ఆదే శించింది. జయప్రద 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపూర్‌ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్‌ పోలీస్‌ స్టేషన్లలో ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగం గా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా జయప్రద స్పందించలేదు. ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్‌ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్‌ చేయలేదు. దీంతో న్యాయస్థానం ఆమెకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 27కు వాయిదా వేసింది.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్