శ్రీమంతుడు సినిమా దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. శ్రీమంతుడు స్టోరీని స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర గతంలో హైదరాబాద్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ సినిమా వివాదంపై పిటిషనర్ ఆర్ఎస్ విల్సన్ స్పందించారు. 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను యథావిధిగా కాపీ కొట్టారని..సినిమా ఇండస్ట్రీకి మొత్తం ఈ విషయం తెలుసని చెప్పారు. అయినా కూడా అంత ధైర్యంగా ఎలా కాపీ కొడతారని ప్రశ్నించారు. ఏ కథ ఆధారంగా శ్రీమంతుడు సినామా నిర్మించారో తెలపాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఏ రచయిత కథ కూడా కాపీ కొట్టకుండా తాను న్యాయపోరాటం చేశానని పిటిషనర్ ఆర్ఎస్ విల్సన్ చెప్పారు.
శ్రీమంతుడుకథపై సుప్రీంకోర్టులో డైరెక్టర్ కొరటాల శివకు చుక్కెదురు
0
540
Previous article
Latest Articles
కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -
- Advertisement -


