Free Porn
xbporn
22.7 C
Hyderabad
Sunday, September 8, 2024
spot_img

మానవత్వానికి మచ్చ …. ఆగని యుద్ధోన్మాదం

       పాలస్తీనా – ఇజ్రాయిల్ యుద్ధం మొదలై 100 రోజులు పూర్తయింది. గాజాపై ఇజ్రాయిల్ మారణ హోమం నిర్విరా మంగా సాగుతోంది. యుద్ధం కారణంగా 23,843 మంది పాలస్తీనియన్లు, 1200 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. ఇప్పటికీ కాల్పుల విరమణ జరగలేదు. గాజాలో నరమేధం ఆగలేదు. ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నా, ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ యుద్ధ విరమణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. యుద్ధం రెండు బద్ధ శతృువుల మధ్య అత్యంత సుదీర్ఘమైన వినాశకరమైన సంఘర్షణగా మారింది.

       గాజా సర్వ నాశనమైంది. గాజా జనాభాలో 85 శాతం మంది నిరాశ్రయులయ్యారు. 60 శాతం ఇళ్లు నేలమట్టమ య్యాయి. గత నవంబర్ లో ఏడు రోజుల కాల్పుల విరమణ పుణ్యమా అని హమాస్ వద్ద బందీలుగా ఉన్న 105 మంది, ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న 240 మంది పాలస్తీనా ఖైదీలు విముక్తి పొందారు. అక్టోబర్ 7న హమాస్ తిరుగుబాటు దార్లు చంపిన ప్రతి ఒక్క ఇజ్రాయిలీకి బదులుగా గాజాలో 100 మంది చొప్పున హతమార్చి ఇజ్రాయెల్ పగతీర్చుకున్నద ని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ పేర్కొంది. వందరోజులుగా ఇజ్రాయిల్ బాంబుదాడుల్లో గాజా, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నేలమట్టమ య్యాయి. మరో పక్క ఇజ్రాయెల్ పైకి హమాస్ రాకెట్ దాడులు చేస్తూనే ఉందని, అలాంటి రాకెట్లు ఉత్తర ఇజ్రాయెల్ లోని బహిరంగ ప్రదేశంలో పడ్డాయని ఇజ్రాయెల్ పేర్కొంది.

        ఇజ్రాయిల్ ఇప్పటికీ బాంబులవర్షం కురిపిస్తూనే ఉంది. ఈ కారణంగా వైద్యం అందించేందుకు పాలస్తీనా రెడ్ క్రెసెంట్ గాజా గోదాములకు చేరుకోలేకపోతోంది. ఖాన్ యూనిస్ లోని అల్ అమల్ హాస్పిటల్ కు రోజూ వెయ్యినుంచి 1500 మంది రోజులు వస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్ ఖాన్ యూనిస్ పై విధించిన నిషేధం వల్ల అత్యవసర మందులు సరఫరా కావడం లేదు. మందులు కొరత కారణంగా బొత్తిగా వైద్యం చేయలేక పోతున్నామని డాక్టర్లు వాపోతున్నారు. ఇజ్రాయిలీ దళాలు ఒక్కో ఇంటిని గుర్తించి, ఆఇంట్లో పిల్లలు, మహిళలు, పెద్దవయస్సువారిని వేధించి, వారు బయ టకు వెళ్లకుండా చేస్తున్నారు. ఇజ్రాయిలీ యుద్ధవిమానాలు ఆ ఇళ్లపై బాంబులు వేసేలా చేస్తున్నారు. అలా బాంబు దాడిలో బతికిని ఓ మహిళ ఈ విషయాన్ని మీడియాకు వివరించింది. యుద్ధంలో చనిపోయినవారిలో రెండు వంతుల మంది పిల్లలు మహిళలే. 148 మంది ఐక్యరాజ్యసమితి సిబ్బంది. 337 మంది డాక్టర్లు, వైద్యసిబ్బంది, 82 మంది యుద్ధవార్తలు సేకరిస్తున్న జర్నలిస్ట్ లు చనిపోయారు.

        ఇజ్రాయెల్ గాజాకు ఆహారం, మంచినీళ్లు, కనీస మందులు రాకుండా కఠిన వైఖరి అనుసరిస్తుండడంతో గాజా గవర్నరేట్ లోని 8 లక్షల మంది నివాసితులు దాహంతో ఆకలి చావుల బారిన పడుతున్నారని గాజా మీడియా ఆఫీసు పేర్కొంది. ఇక్కడ కనీసం రోజుకు 1300 ట్రక్కుల ఆహారం అవసరం, రోజుకు 600 నుంచి 700 ట్రక్కులు సహాయం కూడా వివిధ దేశాల నుంచి అందడం లేదు. ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమం వల్ల దారుణమైన దుర్భిక్షం ప్రబలే ప్రమా దం ఉందని పాలస్తీనా శరణార్థుల కోసం గాజాలో పర్యటించిన ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ అధిపతి ఫిలిప్ లజారిని పేర్కొన్నారు. గత 100 రోజులుగా సాగిన యుద్ధంలో భారీ మరణాలు, విధ్వంసం, స్థానభ్రంశం, ఆకలి, నిరాశ్రయులైన జనం బాధలు మానవత్వానికి మచ్చ తెస్తున్నాయని ఆయన వాపోయారు. గాజాలోని మొత్తం ఓ తరం పిల్లలు తుడిచి పెట్టుకు పోయారని, దుర్భర దారిద్ర్యంలో బతుకుతున్న మిగతా పిల్లలు “షాక్” అవుతున్నారని ఫిలిప్ లజారినీ హెచ్చ రించారు.వెంటనే కాల్పుల విరమణ జరగాలని, యుద్ధం నిలిపివేయాలని ప్రపంచం కోరుతోంది. అమెరికా అధ్యక్ష భవనం వద్ద పాలస్తీనా అనుకూలవాదులు ప్రదర్శనలు జరిపినా..ఇంతవరకూ యుద్ధం ముగింపు వైపు అడుగులు పడలేదు.

Latest Articles

ఎల్‌బీనగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత

ఎల్‌బీ నగర్ చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. శివాజీ విగ్రహాన్ని తొలగించడంతో హిందూ సంఘాలు ధర్నా చేపట్టాయి. శివాజీ మహరాజ్ విగ్రహాన్ని తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగించినా..స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్