మల్కాజిగిరి టికెట్ కోసం దరఖాస్తు చేసిన బండ్ల గణేశ్

      నటుడిగా సినీ నిర్మాతగా..కాంగ్రెస్ నేతగా టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి బండ్ల గణేశ్. ఆయన వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని బండ్ల గణేశ్ భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ తనకు కేటాయించాలంటూ పార్టీకి దరఖాస్తు చేయడం జరిగింది. అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడు …తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్యర్యంలో కాంగ్రెస్ పాలన ప్రజాపాలనగా ప్రజల అభిమానాన్ని గెలుచుకుంటుందని భావించారు. కాంగ్రెస్ అధిష్టానం మల్కాజ్ గిరి లోక్ సభలో పోటీ చేసే అవకాశం కల్పిస్తే …తప్పకుండా గెలిచి చూపిస్తానని చెప్పారు. ఈ క్రమంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మల్యే మల్లారెడ్డి పై బండ్ల గణేశ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు మతి భ్రమించడంతో అనవసరమైన పిచ్చి
పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు .ఆయన విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థిలోకాన్ని ఫీజుల రూపంలో పీల్చి పిప్పి చేస్తున్నారని ఆరోపించారు. ఒక వేళ ఆయన కాంగ్రెస్ లో చేరతానని వచ్చినా చేర్చుకోవడం సాధ్యపడదని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు .

Latest Articles

కేంద్రానికి, సీబీఎస్ఈ బోర్డుకు కేటీఆర్ సూటి ప్రశ్నలు

సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందించారు. మూల్యాంకనంలో అవకతవకలపై అటు కేంద్రాన్ని ఇటు సీబీఎస్‌ఈ బోర్డుని నిలదీశారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు ఆయన మద్దతు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్