పంజాగుట్ట మాజీ ఇన్స్‌పెక్టర్ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాజీ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని తప్పించేందుకు దుర్గారావు సహకరించారు. ఈ కేసులో ఇప్పటి కే దుర్గారావుని సస్పెండ్ చేశారు సిపి కొత్తకోట శ్రీనివాస్. సస్పెన్షన్ తర్వాత సీఐ దుర్గారావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తోటి సిబ్బంది లీకేజీలతో తప్పించుకుంటున్న దుర్గారావు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సీఐ దుర్గారావును అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో సీఐ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నేడు దుర్గారావు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేయనుంది.
పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
0
699
Latest Articles
జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం
జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


