డిసెంబర్ 31 సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. తెలంగాణలో డిసెంబర్ 31న మద్యం అమ్మకాలు పెరిగాయి. మద్యం డిపోలు తెరిచి మరీ వైన్ షాపులకు మందు, బీరులను పంపించారు.ఈ నెల 29, 30, 31 తేదీల్లో 658 కోట్ల మేర మద్యం, బీరు అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా ఈవెంట్లు ఫిక్స్ చేసుకున్న వారితో పాటు క్లబ్బులు, పబ్ లలో పెద్దఎత్తున మద్యం తరలించారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో భారీగా అమ్మకాలు జరిగాయి.
మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్లు తెలుస్తోంది. 30వ తేదీనే 313 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి. అలాగే చికెన్, మటన్, చేపలు కూడా అధికంగా అమ్ముడయ్యాయి.హైదరాబాద్‌లో నాన్ వెజ్ విక్రయాలు జోరందుకున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగగా.. ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం చికెన్ విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే చికెన్ ధరలు మాత్రం అలాగే ఉన్నాయి.