నేడు అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

     టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలపై ఫోకస్‌ చేశారు. ఇందులో భాగంగా ఆయన ప్రజలతో మమేకమవుతున్నారు. రా కదలి రా పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ పీలేరు, ఉరవకొండలో చంద్రబాబు పర్యటిం చనున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదిలి రా సభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి మధ్యాహ్నం చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్లో పీలేరు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. పీలేరులో జరిగే బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అనంతపురం జిల్లా ఉరవకొండలో బహిరంగ సభకు వెళ్తారు.

    వివిధ సామాజిక వర్గాల వారీగా బాబు సమావేశాలకు ఏర్పాటు చేసకున్నట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ అనుసరించిన మార్గంలో టీడీపీ కూడా ప్రయాణం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం ఎత్తుగడలతో ముందుకు వెళుతోంది. స్థానిక సమస్యలను తెలుపుకుని వాటిని పరిష్కరించే దిశగా ప్రజలకు హామీలు ఇస్తూ…స్థానికి నేతలకు ప్రాధాన్యతను ఇస్తూ ముందుకు సాగాలని స్థానికంగా బలం పుంజుకునే దిశగా బాబు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో 45 రోజులపాటు ప్రజల మధ్యలో ఉండేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాడు బాబు. బాబు ష్యూరిటి – భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల మంది కలిసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్