డెన్మార్క్ క్వీన్ పదవీ విరమణ

డెన్మార్క్ లో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా క్వీన్ లైవ్ టీవీలో సర్ ప్రైజ్ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. 1972 లో సింహాసనాన్ని అధిష్టించిన, 83 ఏళ్ల డెన్మార్క్ క్వీన్ రాణి మార్గరెత్-2 జనవరి 14న పదవీ విరమణ చేయనున్న ట్లు ప్రకటించారు. ఆమె స్థానంలో ఆమె పెద్ద కుమారుడు యువరాజు ఫ్రెడరిక్ బాధ్యతలు చేపట్టనున్నారు. అత్యధికం గా 52 ఏళ్ల పాటు సింహాసనాన్ని అధిష్టించిన రాణి ఓ రికార్డు సృష్టించారు. భవిష్యత్ తరానికి బాధ్యతలు అప్పగించా ల్సిన సమయం ఆసన్నమైందని క్వీన్ పేర్కొన్నారు.

గత ఫిబ్రవరిలో విజయవంతంగా వెన్నుకు ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని రాణి ప్రస్తావిస్తూ ఈ ఆపరేషన్ సహ జంగానే భవిష్యత్ గురించి ఆలోచించడానికి అవకాశం ఇచ్చిందన్నారు. డెన్మార్క్ లో దాదాపు 59 లక్షల మంది ప్రజలు రాణి ప్రకటనను వీక్షిస్తారు.

2022 సెప్టెంబర్లో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 మరణం తర్వాత ఐరోపాలో అత్యధిక కాలం అధికారపీఠం అధిష్టించిన, రాణిగా డెన్మార్క్ రాణి గుర్తింపు పొందారు. రాణి సుదీర్ఘకాలంపాటు విధి నిర్వహణలో అంకితభావంతో కృషిచేసి నందుకు డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్ రాణికి కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles

8 వేల మహిళా భవనాలకు వర్చువల్‌గా సీఎం రేవంత్‌ శంకుస్థాపన

మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 8 వేల మహిళా భవనాలకు వర్చువల్‌గా సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేశరు. స్వయం సహాయక సంఘాల కోసం మహిళా భవనాలు నిర్మిస్తున్నారు. ఆడబిడ్డల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్