కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నేతల వలసలు

     బీఆర్ ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి.. కార్పొరేటర్లు క్యూ కట్టారని అనుకోవడం సహజమే. కానీ, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకుల తీరు, సమన్వయ లోపం వల్లే, బీఆర్ ఎస్ ను వీడి అధికారపార్టీలోకి వలసవెళ్తున్నారనే వాదనలు వినిపిస్తు న్నాయి.

        ఇటీవలి కాలంలో రెండో బీఆర్ఎస్ కార్పొరేటర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బోరబండ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశం అయింది. బీఆర్ఎస్ నాయకుల్లో సమన్యాయం లోపించటంవల్లే నాయకులు పార్టీని వీడి అధికార పార్టీ లోకి వలస వెళ్తున్నా రనే వాదనలు వినిపిస్తోంది. 22 ఏళ్లుగా గులాబీ జెండా మోస్తూ, ఉద్యమంలో పాల్గొని, జీహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ గా పనిచేసిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ లో చేరారు. గురువారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దీపా మున్షీ ఆధ్వర్యంలో గాంధీభవన్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

         బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ అధికారప్రతినిధి పదవికీ రాజీనామా చేస్తూ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు ఓ లేఖరాస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పార్టీ అనుసరిం చిన విధానాలు తనకు నచ్చలేదని, పార్టీ ఆవిర్భావం నుంచి తాను కష్టపడి పనిచేశానని, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్నానని, అయినా పార్టీ గుర్తింపు లభించలేదన్నారు.పార్టీ అభివృద్దికి కృషి చేసిన తనకు రాజకీయ భవిష్యత్ లేకుండా కొందరు నాయకులు కుట్ర చేస్తుంటే అధినాయకత్వం వారిపై చర్యలు తీసుకోక పోగా, వారికే మద్దతు ఇవ్వడం తనను తీవ్ర మనస్థాపానికి గురిచేసిందని పేర్కొన్నారు. రాజకీయంగానే కాకుండా భౌతికంగా లేకుండా చేసే కుట్ర జరుగుతుందని తెలిసి అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన ఉద్యమకారుడికి రక్షణ కరువైందని, అందుకే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మీడియా ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

       ఈ మధ్య తెలంగాణ భవన్ లో కేటీఆర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పక్కన ఫసియుద్దీన్ కూర్చోబోగా, గోపీనాథ్ అభ్యంతరం చెప్పడంతో వాగ్వా దం జరిగింది. ఒకే నియోజకవర్గంలో ఇద్ద రికీ ఉన్న వైరం అందరికీ తెలిసింది. బోరబండ డివిజన్లో ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరిగిన కార్పొ రేటర్ బాబాకు ప్రాధాన్యం ఇవ్వకపోగా, కనీసం ప్రోటోకాల్ పాటించటంలేదని బాబా పలు మార్లు వాపోయా రు. అసలు బాబా బీఆర్ఎస్ ను వీడడానికి ఎమ్మెల్యే మాగంటినే కారణమని పార్టీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి వలసలు అధికార పార్టీకి బలం చేకూరుస్తా యనే అభిప్రాయం వ్యక్త మవుతోంది. బీఆర్ ఎస్ అధినాయకత్వం ఇలాంటి గొడవలపై దృష్టి పెట్టని పక్షం లో.. అధికారపార్టీ ప్రత్యర్థి పార్టీ నాయకులకు గాలం వేయడం ఖాయం.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్