ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు నోట్ కలకలం రేపింది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి కోల్‌కతా బయలుదేరిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలోని సిబ్బంది వాష్‌రూం అద్దంపై బాంబు బెదిరింపు సందేశాన్ని గుర్తించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. కోల్‌కతాలో విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది.. ప్రయాణికులకు సురక్షితంగా కిందకు దించారు.
అనంతరం విమానాన్ని ఐసోలేషన్ బేకి తరలించారు. బాంబ్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, ఎయిర్పోర్ట్ పోలీసులు తనిఖీలు చేపట్టగా.. విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కాగా, శుక్రవారం కూడా విమానాశ్రయంలోని మహిళల వాష్‌రూమ్‌లో ఇలాంటి బాంబు బెదిరింపు నోటే కనిపించిందని తెలుస్తోంది. వరుసగా రెండో సారి ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నిందితుల కోసం సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు అధికారులు.
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు
Latest Articles
- Advertisement -


