ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్న వేళ, స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలపై మరోసారి చర్చ మొదలైంది. ఆ సేవలపై వేగ పరిమితులు ఇంకా కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పరిమితుల వల్ల యుద్ధంలో తమకు ఇబ్బందులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.
స్టార్‌లింక్, స్టార్‌షీల్డ్ సేవలపై వేగ పరిమితులు ఇంకా కొనసాగుతున్నాయని జెలెన్స్కీ తెలిపారు. ఈ సేవల వేగాన్ని పూర్తిగా పునరుద్ధరించలేదని స్పష్టం చేశారు. రష్యా దాడులను ఎదుర్కొంటూ తమ సైన్యం ముందువరుసలో నిలబడుతోందని తెలిపారు. తమ సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారని ప్రశంసించారు. పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ రక్షణ చర్యలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
స్టార్‌లింక్ ఆంక్షలపై జెలెన్స్కీ ఫైర్
Latest Articles
- Advertisement -


