నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద అర్ధరాత్రి దాటక 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొదట ఆగి ఉన్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీకొట్టింది. అదేసమయంలో ఎదురుగా ప్రైవేట్ బస్సు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. పోలీసు లు ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రైవేట్ బస్సు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.
కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్జు ప్రమాదం
0
428
Previous article
Latest Articles
వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల
మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -
- Advertisement -


