అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం

    ఒకప్పుడు అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సహా ఎందరో పెద్దమనుషులకు ఈ సెక్స్ కుంభకోణంతో సంబంధం ఉంది. జెఫ్రీ ఎప్ స్టీన్ కు సంబంధించి సెక్స్ స్కాండల్ కేసు డాక్యుమెంట్లను ఓ కోర్టు తాజాగా వెల్లడించింది.

     బిల్ క్లింటన్, నవోమి క్యాంప్ బెల్, అలాన్ డెర్షోవిట్జ్ తో సహా దాదాపు 200 మంది బిలియనీర్లు, పెద్దమనుషుల పేర్లు ఆ డాక్యుమెంట్లలో వెల్లడయ్యాయి. ఈ డాక్యుమెంట్లను బుధవారం నుంచి వెలువరిస్తున్నారు. తొలి విడత 40 పత్రాలను విడుదల చేశారు. జాఫ్రీ ఎప్ స్టీన్ కేసుకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, టీవీఇంటర్ వ్యూలు, బాధితుల వాంగ్మూలాల వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయి. అలాగే, బిల్ క్లింటన్ తో పాటు బ్రిటీష్ రాచకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, మైకేల్ జాక్సన్, డోనాల్డ్ ట్రంప్ వారి పేర్లూ ఈ జాబితాలో ఉన్నారు.

      ఎప్ స్టీన్ సెక్స్ స్కాండల్ ఒకప్పుడు అమెరికాను కుదిపేసింది. ఎప్ స్టీన్ పలువురు టీనేజ్ అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పేద పిల్లలకు వలవేసి .. సెక్స్ కార్యకలాపాల్లో దించాడు. అతని బాధితుల్లో కొందరు 14 ఏళ్లలోపు వారేనని ప్రాసిక్యూటర్లు తెలిపారు. న్యూయార్క్ లోని తన ఇళ్లలోనే ఈ నేరాలకు పాల్పడ్డాడు. పామ్ బీచ్, ఫ్లోరిడా, సెయింట్ థామస్ సమీపంలో అతని ప్రైవేట్ ద్వీపం లో నూ ఈ దారుణాలు జరిగాయి. రెండు దశాబ్దాల పాటు సాగాయి.

       2005లో ఈ కుంభకోణం బయటపడడంతో ఎప్ స్టీన్ ను అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైల్లో ఉంచారు. 2019లో మీటూ ప్రచారంలో మరో సారి ఎప్ స్టీన్ పై ఆరోపణలు రాగా మళ్లీ ఎప్ స్టీన్ ను అరెస్ట్ చేశారు. అదే ఏడాది జైలులో ఎప్ స్టీన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ ఆ జెఫ్రీ ఎప్ స్టీన్ డాక్యుమెంట్లను కోర్టు వెల్లడిం చడంతో ప్రముఖుల పేర్లు మరో సారి వెలుగులోకి వచ్చాయి.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్