36.2 C
Hyderabad
Friday, May 15, 2026
spot_img

నిన్న కార్తి.. నేడు సూర్య..

కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తి.. ఈ ఇద్దరు బ్రదర్స్.. తమిళ్ లో ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో.. తెలుగులో కూడా అదే రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే.. నిన్న కార్తికి జరిగినట్టే.. నేడు సూర్యకు జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే అన్నదమ్ములకు ఇద్దరికి ఇలా జరగడం ఏంటి..? సూర్య, కార్తి.. మరింత జాగ్రత్త పడాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు సినీ అభిమానులు. ఇంతకీ.. ఏమైంది..?

సూర్య, కార్తి.. ఈ ఇద్దరు కోలీవుడ్ హీరోలు.. టాలీవుడ్ హీరోలు వలే.. తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అయితే.. కార్తికి జరిగినట్టే.. సూర్యకు ఏం జరిగిందంటే.. కార్తి నటించిన వా వాథియర్ సినిమా అంతా రెడీ చేసుకున్న తర్వాత రిలీజ్ ఆగిపోయింది. ఈ సినిమాకి తెలుగు టైటిల్ అన్నగారు వస్తారు. అయితే.. ఈ మూవీని సంక్రాంతి టైమ్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు.. ప్రమోషన్స్ కూడా చేసి.. ఇక రిలీజ్ ఒక్కటే మిగిలింది అనుకున్న టైమ్ లో సినిమా ఆగిపోయింది. ఆతర్వాత అడ్డంకులు దాటుకుని విడుదల అవ్వడం తెలిసిందే.

ఇక సూర్య విషయానికి వస్తే.. ఈమధ్య కాలంలో సూర్య నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. లేటెస్ట్ గా కరుప్పు అనే తమిళ సినిమాని తెలుగులో వీరభద్రుడు అనే టైటిల్ తో రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసారు. ప్రమోషన్స్ జోరుగా చేశారు. ఈ మూవీని ప్రతిష్టాత్మక సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా చేశారు. ఈ నెల 14న రిలీజ్ అనుకుంటే.. ఊహించని విధంగా షోలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో డైరెక్టర్ ఆర్.జే. బాలాజీ చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ.. చాలా కష్టపడ్డాం.. ఇలా జరుగుతుందని అనుకోలేదు.. అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సూర్య స్వయంగా రంగంలోకి దిగడంతో ప్రాబ్లమ్ క్లియర్ అయ్యింది. వీరభద్రడు సినిమా అడ్డంకులు దాటుకుని ఇప్పుడు శుక్రవారం రిలీజైంది. మరి.. ఈ మూవీ ఎలా ఉందంటే.. ఫస్టాఫ్ ఎంటర్ టైనింగ్ గా ఉందని.. సెకండాఫ్ మాస్ మెచ్చేలా ఉందనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తానికి ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని అన్నదమ్ముల సూర్య, కార్తికి రిలీజ్ టైమ్ లో అడ్డంకులు రావడం అనేది కోలీవుడ్, టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. మరి.. ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఈ బ్రదర్స్ కేర్ తీసుకోవాలి అంటున్నారు నెటిజన్లు. మరి.. వీరభద్రుడు సూర్యకు.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. జగన్ ఇప్పటికైనా ఈ సైలెంట్ నేతల వ్యవహారంపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇలాంటి వారిని పక్కనపెట్టి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించకపోతే రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగతంగా మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం స్పష్టం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Latest Articles

కేసీ వేణుగోపాల్ బదులు సతీషన్‌కే ఎందుకు పట్టం కట్టారు?

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత.. ముఖ్యమంత్రి ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. పది రోజుల పాటు సాగిన తీవ్ర మల్లగుల్లాల తర్వాత, ప్రతిపక్ష నేతగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్