‘‘వీరంతా తోడు దొంగలే.. ఇంతకంటే పెద్ద పదం లేదు. లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం దోచుకున్నారు. టీడీపీ అంటే తోడు దొంగల పార్టీ. ముఠా నాయకుడు చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. స్కాం దర్యాప్తులో ప్రభుత్వ ప్రమేయం లేదు. ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ 20 రోజుల్లో లోకేశ్ ముఠా నానా యాగీ చేసింది. ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైంది’’ అని సజ్జల పేర్కొన్నారు.
‘‘సాక్ష్యాధారాలతో దొరికితే కోర్టు రిమాండ్‌కు పంపింది. జరిగిన స్కామ్‌పై వీరంతా మాట్లాడటం లేదు. దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారు. మేధావులు అనుకుంటున్న కొందరితో స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను దేశ సమస్యలా చిత్రీకరిస్తున్నారు’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.