గాజువాకలో గుడివాడ హవా కొనసాగుతుందా?

    గాజువాక. విశాఖ జిల్లాలో ఉన్న ప్రధాన నియోజకవర్గాల్లో ఒకటి. పారిశ్రామికంగా ఈ ప్రాంతం చాలా కీలకం కావడంతో.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉంటారు. మరి.. అలాంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు తిప్పల నాగిరెడ్డి. మరి.. ఈ ఐదేళ్లలో ఆయన పనితీరు ఎలా ఉంది ? నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు ?

   అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ.. ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆశ్చర్యపోయేలాగా 2019లో గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు తిప్పల నాగిరెడ్డి. అందుకు ప్రధాన కారణం.. జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై ఆయన గెలవడమే. నాటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా వీచినా.. తిప్పల నాగిరెడ్డి గెలుపు మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి.

    తిప్పల నాగిరెడ్డి రాజకీయ ప్రస్థానం ఒక్కసారి పరిశీలిస్తే…2009లో గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు నాగిరెడ్డి. అయితే.. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం అభ్యర్థి చింతలపూడి వెంకట్రామయ్య చేతిలో పరాజయం పాలయ్యారు. అనంతరం 2014 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన ఆయన.. ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ, మరో సారి దురదృష్టం వెంటాడింది. ఆ ఎన్నికల్లోనూ టీడీపీ కేండిడేట్ పల్లా శ్రీనివాసరావు చేతిలో ఓటమి తప్పలేదు. ఇక, 2019 ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి మరోసారి తిప్పల నాగిరెడ్డి రంగంలో నిలిచారు. జనసేన నుంచి ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ బరిలో దిగారు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. అయితే.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. ఊహించని విధంగా తిప్పల నాగిరెడ్డి విజయం సాధిం చారు. అది కూడా 16 వేలకు పైగా ఓట్ల తేడాతో కావడంతో అదో విశేషంగా నిలిచింది. అందరూ నాగిరెడ్డి గెలుపు గురించే మాట్లాడుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే.. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి నాళ్లలో చాలా యాక్టివ్‌గా పనిచేశారు తిప్పల. నియోజకవర్గంలో రోడ్లు వేయడం, కాలువలు పక్కాగా నిర్మించడం, సామాజిక భవనాల నిర్మాణం చేపట్టి ప్రజల్లో పేరు తెచ్చు కున్నారు. అగనంపూడిలో వంద పడకల ఆస్పత్రి వచ్చేలా చూడడంలో సఫలమ య్యారు. నియోజకవ ర్గంలోని పలు వార్డుల్లో క్లీనిక్‌లు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వీటికితోడు ఫార్మాసిటీ కాలనీ పట్టా సమస్య, ఏపీఐఐసీ భూపట్టా సమస్య పరిష్కరించి స్థానికులకు తోడ్పాటునందిం చారు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. అయితే.. వయోభారం మీద పడడం, కోవిడ్‌ సంక్షోభం కారణంగా ఇంకా అనుకున్న స్థాయిలో పనులు జరగలేదని చెబుతున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. అయితే.. ప్లస్‌లు ఉన్నా.. మైనస్‌లు అంతకంటే ఎక్కువే ఉన్నాయన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది.

గాజువాకలో రాజకీయం ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటుంది. అలాంటి చోట విజయం సాధించడం, పైగా పవన్ కల్యాణ్‌పై కావడంతో తమ సమస్యలు అన్నీ తీరుతాయని భావించారు. కానీ, వాస్తవంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి హయాంలో ప్రజల్లో తీవ్ర నిరాశ కలిగించిన అంశం ఏదంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం. కేంద్రం ఓ వైపు స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు అడుగులు వేస్తుంటే ఎమ్మెల్యే ఏ మాత్రం అడ్డుకోలేదన్న విమర్శలు పెద్ద ఎత్తున విన్పించాయి. ఇక, గంగవరం పోర్ట్ విషయంలోనూ ఇదే మాదిరిగా జరిగిందన్న వాదన విన్పిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి నియోజక వర్గ ప్రజలకు పోర్ట్ విషయంలో ఎలాంటి లబ్ది చేకూర్చకుండా సొంత లాభం చూసుకున్నారన్న ఆరోపణ లున్నాయి. దీనిపైనే గంగవరం బాధితులు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.. అవుతున్నారు. నియోజక వర్గ ప్రజల్ని వేధిస్తున్న మరో సమస్య ట్రాఫిక్. పారిశ్రామిక వాడ కావడం, బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో నిత్యం ఇక్కడి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే రోడ్డుపై నుంచే నిత్యం వీఐపీలు, వీవీఐపీలు వెళ్లినా ట్రాఫిక్‌లో చిక్కుకోక తప్పదన్న మాట విన్పిస్తుం టుంది. అయినా సరే.. ఇది పరిష్కరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవన్నీ ఒత ఎత్తైతే.. ఎమ్మెల్యేకుమారుల జోక్యం నియోజకవర్గంలో ఎక్కువైందన్న విమర్శలు న్నాయి. పైగా ఏ పని జరగాలన్నా.. భవనాలు నిర్మించాలన్నా ఎంతో కొంత చదివించుకో వాల్సిందేనన్న ఆరోపణలున్నా యి. వీరికి సంబంధించిన నాయకులు ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతుం టారన్న చెడ్డ పేరు మూటగ ట్టుకున్నారు. దీంతో.. అన్నీ ఆలోచించిన వైసీపీ హైకమాండ్‌ తిప్పలకు టికెట్ నిరాకరిం చింది. మొత్తం గా చూస్తే.. కొంచెం ఇష్టం..ఎంతో కష్టం అన్నట్లుగా తిప్పల నాగిరెడ్డికి నియోజ కవర్గ ప్రజలు.. వందకు నలభై మార్కులు వేశారు. ఈసారి గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి బరిలోకి దిగకపోవడంతో కొత్త ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్ నాథ్ సీటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో గత వైసీపీ ఎమ్మెల్యే పాలనా ప్రభావం గుడివాడ అమర్ నాథ్ పై ఎంతమేరకు ఉంటుంది. వచ్చే ఎన్ని కల్లో గుడివాడ హవా కొనసాగడానికి ఛాన్స్ ఉందా అనేది వేచి చూడాల్సిందే.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్