26.2 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు లేట్ అయింది

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు , ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ గురించి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రస్తావించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం పర్యటనలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తావన ఆయన తీసుకువచ్చారు. దీంతో ఒక్కసారిగా పోలవరం ప్రాజెక్ట్ తెరమీదకు వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్‌ను జగన్మోహన్ రెడ్డి సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండి పడ్డారు అమిత్ షా. అంతేకాదు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పోలవరం ప్రాజెక్ట్‌ ను శరవేగంగా పరుగులు తీయిస్తామన్నారు.

కేంద్ర మంత్రి అమిత్ షా ఒక్కరే కాదు సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్‌పై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆటంకంగా మారిందని ఘాటు విమర్శలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ సర్కార్ ఒంటెత్తు పోకడలను గతంలో కేంద్ర ప్రభుత్వం అనేకసార్లు తప్పు పట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా పోలవరం విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ తాను వ్యవహరించే తీరు మార్చుకోవాలని కేంద్రం హితవచనాలు పలికిందన్నారు నీటిపారుదలరంగ నిపుణులు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సూచనలు, సలహాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు నిపుణులు.

 2019లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పడగానే రివర్స్ టెండర్లను ప్రారంభించారు. రివర్స్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పోలవరం ప్రాజెక్టు పనులు వెనక్కి పోవడం మొదలైంది. దీంతో ప్రాజెక్ట్ పనులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పోలవరం ప్రాజెక్ట్ కోలుకోలేనంతగా దెబ్బతింది. అంతేకాదు ఎగువ కాఫర్ డ్యాంలోని ఖాళీలను గుర్తించి కూడా పూడ్చడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపిం చింది. ఈ ప్రభావం డయాఫ్రం వాల్‌ సేఫ్టీ పై పడింది. అంతి మంగా డయాఫ్రం వాల్ దెబ్బతింది. అలాగే దిగువ కాఫర్ డ్యాం పనుల పట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంతు లేని జాప్యం చేసింది. దీని వల్ల వరద నీరు ప్రధాన ఆనకట్టవరకు చొచ్చుకువచ్చింది. వీటన్నిటితో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో గైడ్ బండ్‌ కూడా కుంగిపోయింది. అయినప్పటికీ జగన్ సర్కార్‌లో ఎటువంటి చలనం లేదు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన కీలక నిర్మాణం దెబ్బతింటే  అదో చిన్న సమస్య అన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించింది.

  వాస్తవానికి 2014 – 2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పోలవరం ప్రాజెక్ట్ పనులను వారానికోసారి సమీక్షించేవారు. సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడే వారు. అధికార యంత్రాం గానికి మార్గనిర్దేశనం చేస్తూ ప్రాజెక్ట్ పనులను పరుగులు పెట్టించే వారు. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక పోలవరం రివర్స్ లో వెళ్లడం ప్రారంభమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే అంతా తలకిందులైంది. ముఖ్య మంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఏనాడూ పోలవరం ప్రాజెక్ట్ వద్దకు వచ్చి అధికారులతో మాట్లాడింది అలాగే సమీక్షా సమావేశాలు నిర్వహించిందీ లేదు అంటూ గుర్తు చేస్తున్నారు నీటిపారుదలరంగ నిపుణులు.

  గతంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌కు ఉన్న దోస్తానా అందరికీ తెలిసింది. వాస్తవానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీయే కూటమిలో లేదు. అయినప్పటికీ బీజేపీకి అనధికారికంగా మిత్రపక్షంగానే కొనసాగింది. లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బిల్లును వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. కేంద్ర ప్రభుత్వంతో ఇంతగా సత్సంబంధాలు ఉన్నప్పటికీ పోలవరం ప్రాజెక్ట్‌ పై జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఒత్తిడి తీసుకురాలే దంటున్నారు ఇరిగేషన్ ఎక్స్‌ పర్ట్స్‌. ఒకదశలో జగన్ సర్కార్‌లో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి సంబంధించి గడువు ప్రకటించారు. అది కూడా అసెంబ్లీ వేదికగానే. అయితే ఈ మాటను కూడా జగన్మో హన్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిది. అయితే ఈ వాస్తవాలను అంగీకరించడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్దంగా లేదు. పోలవరం ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం శాయ శక్తులా కృషి చేసిందంటున్నారు జగన్మోహన్ రెడ్డి. పోలవరం విషయంలో చెప్పుకోవడా నికి ఏమీ లేకపోగా, తెలుగుదేశం పార్టీతో డైలాగ్‌ వార్‌కు దిగింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి పోలవరం జాతీయ హోదా ఉన్న ప్రాజెక్ట్. దీంతో పోలవరం ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్. జాతీయ హోదా ఉన్న ప్రాజెక్ట్‌కు అవసరమైనన్ని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.

అనుకున్న గడువులోగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ నీటి కరువును తీర్చడానికి అవకాశం దక్కేది. అంతేకాదు ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ జలకళను సంతరించుకునేవి. మొత్తంగా చూస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల ఫలితంగా పోలవరం నిర్మాణ ఖర్చు ఇబ్బడిమబ్బడిగా పెరిగింది. ఒక్క స్పిల్ వే మినహా ప్రాజెక్ట్‌లోని మిగిలిన నిర్మాణాల భద్రత సైతం ప్రమాదంలో పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజనరీగా పేరుంది. పరిపాలనా దక్షత గల నాయకుడిగా జాతీయస్థాయిలోనే ఆయన పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ నిర్మాత చంద్రబాబేనన్న సంగతి దేశమంతా తెలిసిందే. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఈ దక్షతను చంద్రబాబు ఉపయోగించాలని ప్రజలు కోరుతు న్నారు. ఏదిఏమైనా ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్లీ పట్టాలకెక్కా లని. సాధ్యమైనంత త్వరగా పూర్తికావాలని ప్రజలు ఆశిస్తున్నారు.

Latest Articles

రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో మరో ట్విస్ట్‌

తనను ప్రేమించి మోసం చేశాడంటూ నటుడు రాజ్‌తరుణ్‌పై ఇటీవల ఫిర్యాదు చేసిన లావణ్య.. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అర్ధరాత్రి తన అడ్వకేట్‌కు మెసేజ్ పంపారు. తాను వెళ్లిపోతున్నానంటూ అందులో పేర్కొన్నారు. దీంతో అడ్వకేట్‌ .....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్