YS.Sharmila | తప్పు చేస్తే నా బిడ్డయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు.. జైలుకు పంపుడే అన్న కేసీఆర్.. ఇప్పుడు నీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని నువ్వే ఒప్పుకున్నావు కదా? అని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్. షర్మిల ప్రశ్నించారు. దళిత బంధులో రూ.3 లక్షల లంచం తీసుకుంటున్నారు. వాళ్ల చిట్టా ఉందని చెప్తున్నా నువ్వు వాళ్ల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించడం లేదు? ఎవరో అనామకుడు ఫిర్యాదు చేస్తే వెనకాముందు ఆలోచించకుండా మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసావు కదా… మరి ఆ అనామకుడికున్న విలువ నీకు లేదా?నీ దగ్గర చిట్టా ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు కేసీఆర్? అంటూ నిప్పులు చెరిగారు. నువ్వు చర్యలు తీసుకొంటే లిక్కర్ స్కామ్ లో నీ బిడ్డ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ప్రశ్నిస్తారనే కదా.. ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నా కండ్లు తుడుచుకొని చేతకాని దద్దమ్మలా చూస్తున్నావ్… అంటూ ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు. అయినా నీ బంగారు బతుకమ్మే బాగా లేనప్పుడు.. ఇతరులను శిక్షించే అర్హత నీకెక్కడిది. మీ ప్రభుత్వానికి పాలించే స్థాయి ఎక్కడిది. అవినీతి పాలనలో మునిగి తేలిన మీకు, మీ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారు. నీ అధికారాన్ని దూరం చేస్తారని పేర్కొన్నారు.
దళిత బంధులో లంచం తీసుకున్న వారిని ఎందుకు బహిష్కరించడం లేదు?
0
284
Latest Articles
టీడీపీలో దిద్దుబాటు చర్యలు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -
- Advertisement -


