సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వివేక్ కూచిభొట్ల

సంపూర్ణేష్ బాబు, సంజోష్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సోదరా’. అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా. తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు. అలాంటి సోదరులందరి బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తుందని అంటున్నారు. ఇటీవలే విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి స్పందన వస్తుండగా ఈ రోజు మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేతల్లో ఒకరైన వివేక్ కూచిభొట్ల చేతుల మీదుగా ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. సంపూర్ణేష్ బాబు, సంజోష్ ఇద్దరు పెళ్లి కొడుకుల గెటప్‌లో ఒకరు తాళి, ఒకరు రోజా పువ్వు పట్టుకొని ఉండగా వెనక మేళతాళాలతో ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ ని చూస్తుంటే ఈ సినిమా అత్యంత హాస్య భరితంగా ఉండేలా దర్శకుడు మన్మోహన్ మేనంపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు. సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు అతి త్వరలోనే తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా, బాబా భాస్కర్, బాబు మోహన్, గెటప్ శీను

సాంకేతిక బృందం:
కథ, దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లి
సంగీతం: సునీల్ కశ్య ప్
డిఓపి: జాన్
ఎడిటర్: శివశర్వాణి
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ మరియు పూర్ణ చారి
ప్రొడ్యూసర్: చంద్ర చగంలా
నిర్మాణ సంస్థ: క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ మరియు మాంక్ ఫిలిమ్స్
పీఆర్వో: ఏలూరు శ్రీను

Latest Articles

ఫౌజీ వస్తున్నాడు.. మరి.. బాలయ్య..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ఫౌజీ. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు డిసెంబర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్