బెట్టింగ్స్‌ యాప్స్‌కు ప్రచారంపై విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ

బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ ప్రసారమవుతున్న నేపథ్యంలో ఆయన టీమ్ ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది. స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారం నిర్వహించాడని, ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని ఈ సందర్భంగా విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది.

‘‘ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది.

ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదు.’’ అని విజయ్ పీఆర్ టీమ్ తెలియజేసింది.

Latest Articles

ప్రారంభమైన.. క్రేజీ మల్టీస్టారర్..

పటాస్ సినిమా నుంచి మన శంకర్ వరప్రసాద్ గారు వరుకు ప్లాప్ అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న హిట్ మిషన్ అనిల్ రావిపూడి (anil ravipudi). లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్