యాలకులతో మంచి ఆరోగ్యం మీ సొంతం

స్వతంత్ర వెబ్ డెస్క్: భారతీయులు వంటకు వినియోగించే మసాలా దినుసులలో యాలకులు ముఖ్యమైనవి. వీటి వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆహారం రుచితోపాటు, మంచి సువాసను వెదజల్లేలా చేయటంలో యాలకులు ముఖ్యభూమికను పోషిస్తాయి. అసలు ఈ యాలకులు మనిషి శరీరానికి ఎలా ఉపయోగపడతయో చూడండి..

ఈ యాలకులను డిప్రెషన్‌తో బాధపడే వాళ్లు పాలలో కొద్దిగా వేసుకుని తీసుకుంటే అద్భుతమైన లాభాలను పొందవచ్చు. యాలకులు మెటబాలిజంని కూడా మెరుగు పరుస్తాయి. యాలకుల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో అవసరం. యాలకులను తరచూ తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
యాలకుల్లో క్యాన్సర్ తగ్గించే లక్షణాలు ఉంటాయని పరిశోధనలో తేలింది. టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు యాలకులు తీసుకుంటే ఒత్తిడి బాగా తగ్గుతుంది.

ఆయుర్వేదం ప్రకారం యాలకులు అనేవి మూడు దోషాలను కూడా బ్యాలెన్స్ చేస్తాయి. జీర్ణ, బ్లోటింగ్, ఇంటెస్టినల్ గ్యాస్ వంటి సమస్యలు తగ్గించడానికి ఉపయోగపడతాయి. మంచి మౌత్ ఫ్రెషనర్ కింద కూడా యాలకులు పని చేస్తాయి.

యాలకులు అధిక బరువును తగ్గిస్తాయి. యాలకుల్లోని వేడి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. ఇందుకోసం రోజూ రాత్రి ఓ యాలకును తినాలి. శరీరంలోని వ్యర్థాలు, హానికర బ్యాక్టీరియా వంటి వాటిని యాలకులు తరిమేస్తాయి. జలుబు, దగ్గు లాంటివి ఇబ్బంది పెడుతున్నప్పుడు యాలకులు తీసుకుంటే మంచిది. ఇన్ని లాభాలు ఉన్న యాలకులను మీకు అవసరమైన రీతిలో మీరు ఉపయోగించుకోండి.

Latest Articles

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు

ప్రధాని మోదీపై రాహుల్‌గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్‌లను ఆపలేకపోతున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్