తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కూడా టీవీకే ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 234 స్థానాలకు గాను మధ్యాహ్నం 12 గంటల సమయానికి టీవీకే 110 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఏఐఏడీఎంకే 73 స్థానాల్లో, అధికార డీఎంకే కూటమి కేవలం 50 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉండి మూడో స్థానానికి పడిపోయింది. ఉదయనిధితో పాటు పలువురు సీనియర్ మంత్రులు కూడా వెనుకంజలో ఉండటంతో డీఎంకే శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
తాజా ట్రెండ్స్ ప్రకారం టీవీకే పార్టీ ఏకంగా 110 స్థానాల్లో ముందంజలో ఉండి మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో ఉండగా విజయ్ పోటీ చేసిన పెరంబూర్, తిరుచిరాపల్లి (ఈస్ట్) నియోజకవర్గాల్లోనూ ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు అధికార డీఎంకే పార్టీ 50 స్థానాలకు పరిమితమై రెండో స్థానంలో ఉండగా ప్రతిపక్ష ఏఐఏడీఎంకే 73 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కనబరుస్తోంది. పాత తరం ద్రావిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ ఒక కొత్త రాజకీయ శక్తిగా టీవీకే అవతరిస్తున్నట్లు ఈ ట్రెండ్స్ సూచిస్తున్నాయి.


