స్వతంత్ర, వెబ్ డెస్క్: హైదరాబాద్ ఎల్బీ నగర్ లో విషాదం నెలకొంది. కారుప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మన్సూరాబాద్-ఎల్బీనగర్ మార్గంలో రోడ్డుపై కారు ఆపిన డ్రైవర్ హఠాత్తుగా కారు డోర్ తీశాడు. ఈ క్రమంలో అటుగా వచ్చిన బైక్‌కు కారు డోర్ తగిలింది. దీంతో దంపతులు సహా రెండేళ్ల చిన్నారి బైక్‌పై నుండి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో చిన్నారి ధనలక్ష్మి (2) అక్కడికక్కడే మృతి చెందింది. పాప తల్లిదండ్రులు స్వల్ప గాయాలతో బయటపడగా.. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. పరిస్థితిని సమీక్షించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎల్బీ నగర్ లో విషాదం.. రెండేళ్ల చిన్నారి మృతి
0
290
Previous article
Latest Articles
ప్రభాస్.. షాకింగ్ అనౌన్స్ మెంట్..
బాహుబలి మూవీ ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు.. అని నిరూపించింది దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.....
- Advertisement -
- Advertisement -


