Schemes for Farmers |రైతుల కోసం కేంద్రప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమిటో తెలుసా..

Schemes for Farmers |ప్రజల సంక్షేమంతో పాటు.. వివిధ వర్గాల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఉంటాయి. వీటిపై ప్రజలకు పూర్తిగా అవగాహన ఉండదు. దీంతో అర్హులు సైతం ఆయా పథకాల ప్రయోజనాలు పొందలేరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ, బీఆర్‌ఎస్‌తో పాటు.. కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ నాయకుల మధ్య పథకాల విషయంలో పంచాయితీ నడుస్తూనే ఉంటుంది. కేంద్ర పథకాలను రాష్ట్ర పధకాలుగా ప్రచారం చేసుకుంటున్నాయంటూ బీజేపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రైతులకు పెట్టుబడి సాయం అందించే విషయంలో కేంద్రప్రభుత్వానికి, ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి మధ్య వార్ నడుస్తోంది. కేంద్రం డబ్బులు ఇస్తుంటే జగన్‌ ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. తాజాగా రైతుల కోసం కేంద్రప్రభుత్వం ఎన్నో పథకాలను అమలుచేస్తోందంటూ బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు సోము వీర్రాజు ట్వీట్ చేశారు. ఇంతకీ ఆపథకాలెంటో తెలుసుకుందాం.

Schemes for Farmers |ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ , ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఇ – నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన, ప్రధానమంత్రి కుసుమ్ యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, కృషి ఉడాన్ యోజన, భూసార పరీక్షా కార్డులు, ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన, ప్రధానమంత్రి శ్రమ యోగి మంధన్ యోజన, కిసాన్ రైల్, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, విత్తన శుద్ధి నాణ్యత, గోబర్ ధన్ యోజన, వన్ ధన్ యోజన, కనీస మద్దతు ధర, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, కిసాన్ రాత్, ప్రధానమంత్రి కృషి సించాయు యోజన, పరం పరాగత్ కృషి వికాస్ యోజన, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్, ప్రధానమంత్రి లైవ్ స్టాక్ డిసీజెస్ కంట్రోల్ స్కీమ్, నేషనల్ బాంబు మిషన్ అండర్, అన్నదాత ఆమ్ సన్ రక్షణ అభియాన్, నీమ్ కోటెడ్ యూరియా వన్ నేషన్ వన్ ఫెర్టిలైజర్ లాంటి అనేక పథకాలు రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని సోము వీర్రాజు పేర్కొన్నారు.

Read Also: కొత్త నెలతో పాటు కొత్త నిబంధనలు వచ్చేశాయి.. అవెంటో తెలుసుకోండి..

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్