ఏపీకి పొంచి ఉన్న ముప్పు.. రానున్న రోజుల్లో మరో అల్పపీడన గండం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: గత కొద్దిరోజులుగా ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ప్రజలకు మరో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఆగష్టు 2వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర, ఒడిశా తీరం మధ్యే కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలహీనపడిన తర్వాతే.. ఈ అల్పపీడనంపై స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తాంద్ర మీదుగా కొనసాగుతోంది. అలాగే ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.

 

దీని ప్రభావం కారణంగా రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అలాగే మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉరుములతో కూడిన మెరుపులు ఒకట్రెండు చోట్ల సంభవించవచ్చునని, ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటికి రాకూడదని అధికారులు సూచించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రదేశాలను చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్