స్వతంత్ర వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయణ్ను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఇప్పటికీ టీడీపీ నేతలు, అభిమానులు, నారా, నందమూరి కుటుంబాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా చంద్రబాబు అరెస్టుపై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి టీడీపీని దెబ్బకొట్టామని వైసీపీ అనుకుంటోందని లోకేశ్ అన్నారు. కానీ.. ఈ నిర్బంధాలు ప్రజల నుంచి చంద్రబాబును దూరం చేయలేవని తెలిపారు. తన తండ్రిని అక్రమంగా అరెస్టు చేసి టీడీపీని దెబ్బ కొట్టామని అనుకుంటున్న వైసీపీ నేతలు సైకోలు అని లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ నిర్బంధాలు ప్రజానాయకుడైన చంద్రబాబును ప్రజల నుంచి వేరు చేయలేవని తెలిపారు. ఎప్పటికైనా నిజం గెలిచి తీరుతుందని అన్నారు. మరింత బలంగా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం-రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తారని తన తల్లి చెప్పిందంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. మరోవైపు.. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. బాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. వారికి అండగా బాబు ఉంటారని భరోసా కల్పిస్తున్నారు.
ఈ నిర్బంధాలు చంద్రబాబును ప్రజల నుంచి దూరం చేయలేవు- లోకేశ్
0
298
Latest Articles
ఏలూరులో ఇంజనీరింగ్ కాలేజీలో భారీ దోపిడీ… రూ.కోటి అపహరణ… థార్ గ్యాంగ్ పనేనా?
ఏలూరు భారీ దోపిడీ జరిగింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దోపిడీ జరిగింది. ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ లో రికార్డ్ అయిన సీసీటీవీలో ఫుటేజ్‌లో థార్...
- Advertisement -
- Advertisement -


