ఫ్లెక్సీలో మా నాయకుడి ఫోటో లేదు.. అమిత్ షా సభను బహిష్కరిస్తామని హెచ్చరిక..!

స్వతంత్ర వెబ్ డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు తెలంగాణలో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగనున్న రైతు గోస-బీజేపీ భరోసా సభలో పాల్గొంటారు. ఈ బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫోటో కనిపించకపోవడం వివాదాస్పదమైంది. మైదానం లోపల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఈటల ఫోటో కనిపించకపోవడంతో ఆయన వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. ఈటల ఫోటో లేకపోతే తాము అమిత్ షా సభను బహిష్కరిస్తామని హెచ్చరించినట్టు తెలుస్తోంది.

 

 

స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ సభ్యులు పలువురు అలకవహించారు. రేపటి లోపు ఈటల ఫోటో ఉండాలని ఆయన వర్గీయులు డిమాండ్ చేశారు. నిర్వహణ కమిటీ సభ్యులతో కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ సహా పలు ప్రాంతాల నుండి వచ్చిన ఈటల వర్గీయులు వాదనకు దిగారు. రేపు ఉదయం లోపు ఫ్లెక్సీలో ఈటల పోటోను ఏర్పాటు చేస్తామని సభ నిర్వాహకులు వెల్లడించారు. ఈటల ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు.

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్