30.1 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

కాంగ్రెస్‌లోనూ మన బినామీలు ఉన్నారు.. బాల్క సుమన్‌ వ్యాఖ్యలు వైరల్

స్వతంత్ర వెబ్ డెస్క్: చెన్నూర్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌  బాల్క సుమన్(Balka Suman) బహిరంగంగా చేసిన  సంచలన వ్యాఖ్యలు వైరల్‌(Viral) అవుతున్నాయి. కాంగ్రెస్‌లో ఉన్నది మనవాళ్లేననని, తనని పంపింది తానేనని బీఆర్‌ఎస్‌ శ్రేణులను ఉద్దేశించి తెలిపారు. చెన్నూర్‌లో ప్రజాశీర్వాద ర్యాలీలో‌ సుమన్ మాట్లాడుతూ.. ‘‘ కాంగ్రెస్‌లో(Congress) మనవాళ్లు ఉన్నారు. వాళ్లను కాంగ్రెస్‌లోకి   పంపించింది‌ నేనే. ఆ కాంగ్రెస్ నాయకులు కూడా.. ఎన్నికల తర్వాత మన పార్టీలోకి  వస్తారు.

 

 

గతంలో చెన్నూర్  కాంగ్రెస్  అభ్యర్థిగా పోటీ చేసిన ఎంపీ వెంకటేశ్‌ మన పార్టీలోకే వచ్చారు. ఇప్పుడున్న కాంగ్రెస్  నాయకులు కూడ బీఆర్‌ఎస్‌కే వస్తారు. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు ప్రచారం కోసం వస్తే సహకరించండి. వాళ్ల ప్రచారాన్ని అడ్డుకోవొద్దు అని కార్యకర్తలను ఉద్దేశించి సుమన్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో తన బినామీలు ఉన్నారన్న బాల్క సుమన్‌ వ్యాఖ్యలు ఇప్పుడు నియోజవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్