జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ పోలింగ్ కొనసాగుతోంది. కేంద్ర పాలిత ప్రాంతంలోని ఆరు జిల్లాల్లో జరుగుతున్న ఈ పోలింగ్ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కాశ్మీర్ లోయలోని మూడు జిల్లాలు గందేర్‌బాల్, శ్రీనగర్, బుద్గామ్ మరియు జమ్మూ ప్రాంతంలోని రియాసి, రాజౌరి మరియు పూంచ్ జిల్లాల్లోని 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 25.78 లక్షల మంది ఓటర్లు నిర్ణయిస్తారు. ఈ దశలో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జేకేపీసీసీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, బీజేపీ జేకే చీఫ్ రవీందర్ రైనా పోటీలో ఉన్నారు.
జమ్మూకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశలో 24 స్థానాలకు సెప్టెంబర్ 18న పోలింగ్ నిర్వహించగా 61.13 శాతం పోలింగ్ నమోదైంది. మూడో దశలో 40 స్థానాలకు అక్టోబర్ 1న పోలింగ్, 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రస్తుతం ఆరు జిల్లాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది.