ఒంగోలులో ఫ్లెక్సీల టెన్షన్ కొనసాగుతుంది. జనసేనలోకి చేరేందుకు రెడి అవుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చించివేయడం కలకలం రేపింది. బాలినేని శ్రీనివాసులురెడ్డి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేపు ఆయన జనసేనలో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరనున్నారు.
అయితే ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసులురెడ్డి అనుచరులు ఒంగోలులో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చించివేయడంతో ఇది ఎవరి పని అనేది ఆరా తీస్తున్నారు. బాలినేని జనసేనలో చేరడం ఇటు టీడీపీ, అటు జనసేన ఒంగోలు నేతలకు ఇష్టం లేదు. ఇది గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది. ఇటీవలే బాలినేనిని జనసేన పార్టీలోకి స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలను పెట్టడంపై అభ్యతరం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం శ్రేణులు ఫ్లెక్సీలను తొలగించారు. తాజాగా మరోసారి ఇదే తరహాలో పలుచోట్ల ఫ్లెక్సీలు చింపివేతతో ఇది కూడా వారిపనిగానే భావిస్తున్నారు.