Pawan Kalyan: తెనాలిలో జనసేన జెండా ఎగురుతుంది..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండానే ఎగురుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. అక్కడ సీటూ మనదే, గెలుపూ మనదే అని చెప్పుకొచ్చారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ ను గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం అని ప్రజలకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో నాదెండ్ల మనోహర్ అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు.

అటువంటి సమర్థ నాయకుడినీ, ఎన్నుకున్న నియోజకవర్గం అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెనాలి ప్రజలు ఎప్పటికీ మరచిపోరు అని చెప్పారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ పార్టీ నాయకులతో జనసేనాని, పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆత్మీయంగా సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరినీ నాదెండ్ల జనసేనానికి పరిచయం చేశారు.

Latest Articles

కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు నిజంగానే కోరుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి సరికొత్త మైండ్ గేమ్‌కు తెరతీసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. కేటీఆర్, హరీశ్ రావు ద్వయం ఒక కొత్త...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్