Amith Sha: టార్గెట్ 75.. ఢిల్లీలో ఉండొద్దు.. గల్లీల్లోనే ఉండాలి..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఎలాగైనాసరే, తెలంగాణలో అధికారంలోకి రావాలి. ఇదీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఫిక్స్‌ చేసుకున్న టార్గెట్‌. అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి.. ఎలా ముందుకెళ్లాలి, ఏం చేస్తే అధికారం బీజేపీ చేతికొస్తుంది. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ హైకమాండ్‌ దగ్గర ఆన్సర్స్‌ ఉన్నాయ్‌.. క్లియర్‌కట్‌గా యాక్షన్‌ ప్లాన్‌ ఉంది.. ఇక ఆగకండి.. ముందుకుపోండి.. అంటూ అధిష్టానం తెలంగాణ నేతలకు సూచనలు చేసింది. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో దాన్నే అడ్వాంటేజ్‌గా తీసుకుంటోంది బీజేపీ అధిష్టానం. ఆల్రెడీ యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించి ఇంప్లిమెంటేషన్‌ మొదలుపెట్టేసింది. అధికారం దక్కాలంటే ఏం చేయాలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ బీజేపీకి క్లియర్‌గా క్లారిటీగా ఆదేశాలిచ్చేశారు.

ఎనీ టాప్‌ లీడర్‌, మస్ట్‌ కంటెస్ట్‌ ఇన్‌ అసెంబ్లీ పోల్స్‌, ఇదే బీజేపీ హైకమాండ్‌ డిసైడ్‌ చేసిన యాక్షన్ ప్లాన్‌. కేంద్ర మంత్రి అయినాసరే, ఎంపీలు అయినాసరే లేక ఇంకెంత పెద్ద లీడర్‌ అయినాసరే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాల్సిందేనంటూ ఆర్డర్స్‌ పాస్ చేశారు అమిత్‌షా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీబీజేపీకి హైకమాండ్‌ ఫిక్స్‌ చేసిన టార్గెట్‌ 75 సీట్స్‌. ఈ నెంబర్‌ సాధించాలంటే, ముఖ్యనేతలంతా అసెంబ్లీ బరిలోకి దిగాలన్నది అమిత్‌షా వ్యూహం. గెలిచే అవకాశమున్న 75 స్థానాలను గుర్తించడంతోపాటు కనీసం 25 నుంచి 35మంది మెయిన్స్‌ లీడర్స్‌ను ఐటెండిఫై చేయాలని ఆదేశించారు షా.

టార్గెట్‌ ఫిక్స్‌ చేయడంతోపాటు రాజకీయం ఎలా చేయాలో… ప్రజలను ఎలా అప్రోచ్‌ కావాలో కూడా క్లియర్‌కట్‌గా డైరెక్షన్స్‌ ఇచ్చారు అమిత్‌షా. బీజేపీ సంప్రదాయ రాజకీయాన్ని పక్కన పెట్టాలని సూచించారు. కొత్త తరహా రాజకీయంతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు షా. ఆపరేషన్స్‌.. డైరెక్షన్స్ తోపాటు.. అమిత్ షా వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ ఆపరేషన్స్‌ అన్నీ ఇకపై ఢిల్లీ నుంచే జరిగేలా తెలంగాణ బీజేపీ వార్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. పార్టీ లైన్‌ దాటితే ఇకపై ఢిల్లీ నుంచి డైరెక్ట్‌ వార్నింగ్‌లు ఉంటాయని.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ నేతలకు హెచ్చరికలు జారీ చేవారు. తక్కువగా మాట్లాడాలని… ఎక్కువగా పని చేయాలని సూచనలు చేసినట్లు సమాచారం.

Latest Articles

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

  తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉద్యోగులకు రెండు డీఏలు, ఎల్‌నినో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్