విజయ్ ఆంటోనీ ‘హిట్లర్’ ఫస్ట్ లుక్ రిలీజ్

పలు వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా ‘హిట్లర్’తో రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీతో గతంలో విజయ్ రాఘవన్ అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్‌గా హిట్లర్ సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. హిట్లర్ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ట్రైన్ జర్నీలో ఉన్న హీరో విజయ్ ఆంటోనీ ఒక క్రైమ్ ఇన్సిడెంట్‌ను ఎదుర్కొన్నట్లు మోషన్ పోస్టర్‌లో చూపించారు. ఇదే ట్రైన్‌లో హీరోయిన్ రియా సుమన్ హీరో కలుసుకుంటాడు. గన్ పేలుస్తోన్న గౌతమ్ మీనన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. మోషన్ పోస్టర్‌లో విజయ్ ఆంటోనీ ఫ్రెష్ లుక్‌లో ఉన్నారు. చివరలో ఆయన జోకర్ గెటప్‌లో కనిపించడం ఆసక్తికరంగా ఉంది. ట్రైన్ జర్నీ నేపథ్యంగా రూపొందించిన మోషన్ పోస్టర్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

‘‘ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ పౌరుడి కథే హిట్లర్. హిట్లర్ ఒక పేరు కావొచ్చు కానీ ఇప్పుడున్న ప్రజాస్వామ్య పరిస్థితుల్లో ఆ పేరు నియంతలకు మారుపేరుగా మారింది. అందుకే సినిమాకు ఈ టైటిల్ యాప్ట్ అనుకున్నాం’’ అని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న హిట్లర్ మూవీని త్వరలో పాన్ ఇండియా స్థాయిలో హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు.

నటీనటులు- విజయ్ ఆంటోనీ, రియా సుమన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు

టెక్నికల్ టీమ్ –
సినిమాటోగ్రఫీ – ననీన్ కుమార్.ఐ
సంగీతం- వివేక్, మెర్విన్
ఆర్ట్ – సి. ఉదయ్ కుమార్
ఎడిటింగ్ – సంగతమిజాన్.ఇ
కొరియోగ్రఫీ – బృందా, లీలావతి
స్టంట్స్ – జి.మురళి
కాస్ట్యూమ్- అనుష.జి.
పీఆర్వో- జీఎస్‌కే మీడియా
ప్రొడ్యూసర్స్ – డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్
రచన, దర్శకత్వం – ధన

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్